అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరం (Hyderabad City)లో డ్రగ్స్ దందా ఆగడం లేదు. డ్రగ్స్ అక్రమ రవాణాలో పలువురు నైజీరియన్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW), టోలిచౌకి పోలీసులతో కలిసి డ్రగ్స్ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరిని తాజాగా అదుపులోకి తీసుకుంది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఇద్దరు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేశారు. టోలిచౌకి పరిధిలోని చిడి ఎజెహ్ వద్ద నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన 150 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | అనేక కేసుల్లో నిందితుడు
చిడి ఎజెహ్ అలియాస్ నాగేశ్వరన్ నైజీరియా నుంచి వచ్చాడు. వీసా గడువు ముగిసిన తర్వాత అక్రమంగా దేశంలో ఉంటున్నాడు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి డ్రగ్స్ (Drugs) సరఫరా చేస్తున్నాడు. అతడిపై గతంలో డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తన పేరును నాగేశ్వరన్గా మార్చుకొని భారతీయ గుర్తింపు పత్రాలను సైతం పొందాడు. ఢిల్లీ (Delhi)లోని నైజీరియన్ జాతీయుడి నుంచి ఎండీఎంఏ, కొకైన్‌ను సేకరించే అంతర్రాష్ట్ర ఔషధ సరఫరాదారుగా పనిచేస్తున్నాడు. మరో నిందితుడు ఒబాసి జేమ్స్ విక్టర్ టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చాడు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాలలో చిడితో కలిసి పని చేస్తున్నాడు. ఢిల్లీలోని మరో నైజీరియన్ నుంచి చిడీ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు. వాటిని హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ అంతటా పెడ్లర్లకు సరఫరా చేస్తున్నాడు. పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.