అక్షరటుడే, వెబ్‌డెస్క్: Drone activity in Jammu Kashmir | జమ్మూకశ్మీర్ Jammu and Kashmir లో మళ్లీ డ్రోన్ల దాడులు కలకలం సృష్టించాయి. నౌషెరా సెక్టార్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఆదివారం (జనవరి 11) సాయంత్రం పాకిస్తాన్ డ్రోన్లు ఎగురుతూ కనిపించాయి. దీంతో భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ విషయాన్ని మన భద్రతా బలగాలు వెల్లడించాయి.
కాగా, సదర పాక్ డ్రోన్లు సరిహద్దులో తుపాకులు విడిచాయా..? లేక మాదకద్రవ్యాలనా..? అనే విషయాన్ని నిర్ధారించేందుకు మన సైన్యం ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ వైపు నుంచి శనివారం వచ్చిన ఓ డ్రోన్ సాంబా సెక్టార్‌లో ఆయుధాలను జార విడవడం గమనార్హం.
Drone activity in Jammu Kashmir |
గతేడాది సమ్మర్లో ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్‌పై పాక్ డ్రోన్లతో విరుచుకుపడింది. కాగా, దాయాది దేశం డ్రోన్లను మన సైన్యం గట్టిగానే తిప్పికొట్టింది. పాక్ డ్రోన్లను కూల్చివేసింది. ఆ తర్వాత కూడా అడపా దడపా డ్రోన్ల దాడులు కొనసాగాయి. కాగా, చాలా రోజుల తర్వాత మళ్లీ ఒకేసారి ఐదు పాక్ డ్రోన్లు చొరబడటం ప్రస్తుతం కలకలం రేపుతోంది. కానీ, ప్రస్తుతం భారత భూభాగంపై ఆయుధాలు, మాదకద్రవ్యాలను వదలడం కోసం ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం కోసం పాక్ డ్రోన్లను వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది.