అక్షరటుడే, ఇందూరు: Global Excellence Award | జిల్లా కేంద్రంలోని శ్రీవిష్ణు హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ రమణేశ్వర్కు గ్లోబల్ ఎక్స్లెన్స్ అవార్డు (Global Excellence Award) దక్కింది.
రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్ అండ్ సర్జన్స్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లో (Hyderabad summit) నిర్వహించిన సమ్మిట్లో అవార్డును అందజేశారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణేశ్వర్ మాట్లాడుతూ అవార్డు అందుకోవడంతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలిపారు.
