అక్షరటుడే, ఇందూరు: Vissa Health X Award : నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు బొద్దుల రాజేంద్రప్రసాద్ కు dr rajendra prasad boddula అరుదైన గౌరవం దక్కింది. రాజ్ న్యూస్ ఛానల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ ను nizamabad dr rajendra prasad ప్రతిష్ఠాత్మక విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారంతో సత్కరించింది.
వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న వైద్యులకు రాజ్ న్యూస్ ఛానల్ విస్సా హెల్త్ ఎక్స్ పేరిట పురస్కారాలు vissa heath ex awards ప్రదానం చేసింది.
నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఛాతి వైద్య నిపుణులు, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ sri vishnu super speciality hospital nizamabad అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్ అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించి రాజ్ న్యూస్ ఆయనను విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారానికి ఎంపిక చేసింది.
హైదరాబాద్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ ఈ పురస్కారం అందుకున్నారు. కార్యక్రమానికి అతిధులుగా హాజరైన రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్కలు కలిసి డాక్టర్ రాజేంద్రప్రసాద్ కు పురస్కారం అందజేసి అభినందించారు.

డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారం అందుకున్న సందర్భంగా.. నిజామాబాద్ జిల్లా పద్మశాలి యువజన సంఘ అధ్యక్షుడు మెరుగు నాగరాజు ఆధ్వర్యంలో వైద్యుడిని సన్మానించారు. కార్యక్రమంలో పద్మ సుభాష్, అదేళ్లి పురుషోత్తం, ఆకుపత్రి శ్రీకాంత్, దాసరి చంద్రకాంత్, కట్ట పాండు రాజ్, కట్ట రాజేందర్, సామల సాయి కృష్ణ, పులగం సాయి, నల్లూరి రఘువీర్, పెంటం జగన్, పెంటి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.