Homeజిల్లాలునిజామాబాద్​DCP Baswareddy | సైబర్​ నేరగాళ్ల వలలో పడవద్దు: డీసీపీ బస్వారెడ్డి

DCP Baswareddy | సైబర్​ నేరగాళ్ల వలలో పడవద్దు: డీసీపీ బస్వారెడ్డి

సమాజంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగాయని డీసీపీ బస్వారెడ్డి పేర్కొన్నారు. నేరగాళ్ల వలకు చిక్కకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: DCP Baswareddy | సమాజంలో వరకట్న వేధింపులు తగ్గినప్పటికీ.. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయని డీసీపీ బస్వారెడ్డి (DCP Baswareddy) అన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవాన్ని న్యూ అంబేడ్కర్​ భవన్​లో మహిళా సంక్షేమ శాఖ(v), సఖి సెంటర్, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్​స్ట్రక్షన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ సోషల్ మీడియా (Social Media) వాడడం వల్ల తమ వ్యక్తిగత విషయాలు, ఫొటోలను సైతం బయటకు వెళ్తాయన్నారు. దీంతో ఆ విషయాలను, ఫొటోలను సైబర్​ నేరగాళ్లు మార్ఫింగ్​ చేస్తూ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారన్నారు. అనవరమైన యాప్​లకు వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వవద్దని సూచించారు. అలాగే సోషల్ మీడియాలో వాట్సాప్, ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ లాంటి వాటిల్లో సైతం వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడం ద్వారా వ్యక్తిగత భద్రతకు భంగం కలుగుతుందన్నారు.

అనంతరం అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బీ, శ్రీలత, జీజీహెచ్​ గైనకాలజిస్ట్ అరుణ రేఖ, సఖి వన్​స్టాప్ సెంటర్, సెంటర్ అడ్మినిస్ట్రేటర్ భానుప్రియ పాల్గొన్నారు.