Homeతాజావార్తలుMamita Baiju | ఒక్క హిట్‌తో అంతా ఈ అమ్మ‌డి జ‌ప‌మే.. ఇటు టాలీవుడ్‌, అటు...

Mamita Baiju | ఒక్క హిట్‌తో అంతా ఈ అమ్మ‌డి జ‌ప‌మే.. ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్‌లో బిజీ బిజీ..!

ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్ హిట్‌తో సినీ పరిశ్రమలో ఎవ‌రి కెరీర్ ఎలా మారిపోతుందో తెలియాలంటే.. మమిత బైజు గురించి తెలుసుకుంటే చాలు! ప్రస్తుతం ఆమె తమిళ, తెలుగు చిత్రసీమల్లో దూసుకెళ్తుండగా, భవిష్యత్తులో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Mamita Baiju | ఇండస్ట్రీలో (Industry) ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. క్షణంలో కెరీర్ మలుపు తీసుకుంటుంది. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నారు మలయాళ బ్యూటీ మమిత బైజు (Malayalam beauty Mamita Baiju).

ఒకప్పుడు చిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసిన ఈమె, ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీల్లో (South Indian industry) మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. మలయాళంలో 10కి పైగా సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాకపోయిన మమితకు, ‘ప్రేమలు’ అనే ఒక్క చిత్రం ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా పెద్ద హిట్ కావడంతో, మమితకు ఒక్కసారిగా అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం తమిళంలో మమిత బైజు (Mamitha baiju) డేట్స్‌కు డిమాండ్ తారాస్థాయిలో ఉంది.

Mamita Baiju | ఫుల్ డిమాండ్..

యూత్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ సరసన ‘డ్యూడ్’ సినిమాలో (Dude Movie) లీడ్ రోల్ చేస్తున్న మమిత, సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. అంతేకాదు, ఇళ‌య‌ద‌లపతి విజయ్ చివరి చిత్రం జన నాయగన్​లో కూడా మమిత కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆమె కథానాయిక కాకపోయినా, స్క్రీన్‌ప్లే పరంగా అంతకు మించిన పాత్రతో అలరించనున్నట్లు సమాచారం. ధనుష్ – రాజ్ కుమార్ పెరియసామి కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమాలోనూ మమితను హీరోయిన్‌గా ఫైనల్ చేసినట్లు కోలీవుడ్ (Kollywood) వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ సినిమా మమిత కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ అమ్మ‌డికి డిమాండ్ పెరిగింది. మమిత బైజు పట్ల టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. యంగ్ హీరోలతో పాటు, మిడ్ రేంజ్ స్టార్ హీరోల ప్రాజెక్టుల కోసం ఆమెను సంప్రదిస్తున్నారు. తక్కువ సమయంలో ప‌లు ఇండస్ట్రీల్లోనూ క్రేజ్ సంపాదించుకోవడం చాలా అరుదు. కేరళలోని కొట్టాయం జిల్లా కిడంగూర్​లో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండడంతో కొచ్చిలోని (Kochi) ఓ కళాశాలలో సైకాలజీలో బీఎస్సీ విద్య‌ని అభ్య‌సించింది. అయితే సినిమాల‌పై ఆస‌క్తి క‌ల‌గ‌డంతో చ‌దువు వ‌దిలేసి మ‌ల‌యాళంలో ప‌లు సినిమాలు చేసింది. ప్రేమలు అనే ఒకే ఒక్క సినిమాతో ఈ అమ్మ‌డి పేరు మార్మోగిపోతోంది.