అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని కోటగల్లీలో ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో (BC Welfare Shelter) విద్యార్థినులకు రగ్గులు పంపిణీ చేశారు. అమెరికాకు చెందిన ‘హెల్ప్ టు అదర్స్’ (Help to Others charity organization) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి విద్యార్థినలకు సేవా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా బీసీ అభివృద్ధి అధికారి(District BC Development Office) నర్సయ్య మాట్లాడుతూ చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని హెల్ప్ టు అదర్స్ సంస్థ రగ్గులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. జిల్లాలో హెల్ప్ టు అదర్స్, లయన్స్ వంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇప్పటివరకు 220 రగ్గులు అందజేయడం జరిగిందన్నారు. విద్యార్థినిలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని చిన్నప్పటినుంచి సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాధారాణి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు, కోశాధికారి కరిపె రవీందర్, హెల్ఫ్ టు అదర్స్ తెలంగాణ కో ఆర్డినేటర్ జిల్కర్ విజయానంద్, జిల్లా కో-ఆర్డినేటర్ చింతల గంగాదాస్, రమణ స్వామి, రెడ్‌క్రాస్ పీఆర్వో రామకృష్ణ పాల్గొన్నారు.
