Homeజిల్లాలునిజామాబాద్​Indiramma sarees | మహిళల ఆత్మగౌరవం నిలిపేలా ఇందిరమ్మ చీరల పంపిణీ

Indiramma sarees | మహిళల ఆత్మగౌరవం నిలిపేలా ఇందిరమ్మ చీరల పంపిణీ

మహిళల ఆత్మగౌరవాన్ని నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ నిర్వహిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్​లో శనివారం చీరల పంపిణీని ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Indiramma sarees | మహిళల ఆత్మగౌరవాన్ని నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల (Indiramma sarees) పంపిణీ నిర్వహిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల సలహాదారు సుదర్శన్ రెడ్డి అన్నారు. కలెక్టరేట్​లో శనివారం ఎమ్మెల్యేలు భూపతిరెడ్డి, ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేష్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy) మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళల ఆత్మ గౌరవాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి నాణ్యమైన చీరలను తయారు చేయించిందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో నాసిరకం చీరలు అందించారని గుర్తు చేశారు. అర్హులైన మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ అయ్యేలా పారదర్శకంగా, ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రభుత్వం అన్ని జిల్లాలకు సరిపడా చీరలను చేరవేసిందన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వైపు పిల్లలు పెడదారి పట్టకుండా కాపాడుకోవాలని సూచించారు.