అక్షరటుడే, ముప్కాల్: lions club | లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ (Lions Club of Balkonda) ఆధ్వర్యంలో విద్యార్థులకు నిఘంటువుల పంపిణీ చేశారు. ముప్కాల్ మండలంలోని (Mupkal mandal) కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, కిసాన్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు డిక్షనరీలను అందజేశారు.
డిక్షనరీలు విద్యార్ధుల భవిష్యత్తు విద్యాభ్యాసానికి ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా లయన్స్ క్లబ్ ఛైర్మన్ లింగం మాట్లాడుతూ ‘లయన్స్ క్లబ్’ ప్రపంచవ్యాప్తంగా సేవే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన భీమ్‌గల్‌కు చెందిన ప్రముఖ కవి, సుప్రసిద్ధ వ్యాఖ్యాత కంకణాల రాజేశ్వర్‌ను లయన్స్ క్లబ్ ఆఫ్ కిసాన్‌నగర్ (Lions Club of Kisan Nagar) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జోన్ ఛైర్మన్ నల్ల జ్ఞానసాగర్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ ఛైర్మన్ దినేష్ పటేల్, కంటి సహాయ నిపుణుడు డాక్టర్ బ్యాగరి పుణ్యరాజ్ తదితరులు పాల్గొన్నారు.
