అక్షరటుడే, వెబ్‌డెస్క్: Dichpally SHO | నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్‌హెచ్‌వోగా ఆదివారం (నవంబరు 23) ఆరిఫ్ బాధ్యతలు స్వీకరించారు.
ఇంతకు ముందు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించిన ఆరిఫ్‌ను ఇటీవలే నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఏఆర్‌కు అటాచ్ చేశారు.
అనంతరం డిచ్పల్లి ఠాణా బాధ్యతలను కట్టబెట్టారు. సీపీ ఆదేశాల మేరకు ఆరిఫ్ డిచ్పల్లి ఎస్‌హెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు.
Dichpally SHO | శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం..
ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌వో ఆరిఫ్ మాట్లాడుతూ డిచ్పల్లి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు.
అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తే పోలీసులకు సమాచారం అందజేయాలని ప్రజలకు సూచించారు.
