HomeసినిమాDharmendra | ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉంది.. క్లారిటీ ఇచ్చిన ఆయన కూతురు

Dharmendra | ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉంది.. క్లారిటీ ఇచ్చిన ఆయన కూతురు

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. అయితే, ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కుటుంబ సభ్యులు స్పష్టంచేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dharmendra | బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆరోగ్యం విషయంలో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో (Social Media) పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

89 ఏళ్ల ధర్మేంద్ర శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్​లో (Breach Candy Hospital) చికిత్స పొందుతున్నారని, ఆయన వెంటిలేటర్​పై ఉన్నారని, మరణించారనే రూమర్లు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే, ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని, వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ముఖ్యంగా కుమార్తె ఇషా డియోల్ (Esha Deol) సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన చేశారు.

Dharmendra | అవాస్త‌వాలు..

త‌న సోష‌ల్ మీడియాలో.. “మీడియా ఓవర్‌డ్రైవ్‌లోకి వెళ్లి తప్పుడు వార్తలను (Fake News) ప్రచారం చేస్తోంది. నా తండ్రి ఆరోగ్యం స్థిరంగానే ఉంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. మా నాన్న ఆరోగ్యం కోసం ఆందోళన వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపారు. 1935 డిసెంబరు 8న జన్మించిన ధర్మేంద్ర (Dharmendra) అసలు పేరు ధరం సింగ్ డియోల్. 1958లో విడుదలైన దిల్ భీ తేరా హమ్ భీ తేరే సినిమాతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత షోలే, చుప్కే చుప్కే, ధర్మ్ వీర్, యాదోంకీ బారాత్ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. 300కు పైగా చిత్రాల్లో నటించిన ఆయనను అభిమానులు “హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్” అని పిలుస్తారు.

సినీ రంగానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు 2012లో పద్మభూషణ్ అవార్డు లభించింది. అంతేకాకుండా ఫిలింఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. ధర్మేంద్ర నటించిన తాజా చిత్రం “ఇక్కీస్” (Ikkis) పరమవీర చక్ర గ్రహీత లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్‌పాల్ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదల కానుంది. సినీ అభిమానులు ధర్మేంద్ర త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Must Read
Related News