అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay | ఇటీవల జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలుపొందిన మున్నూరు కావు సామజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులను సన్మానించనున్నట్లు మున్నూరు కాపు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్ తెలిపారు.
Dharmapuri Sanjay | భారీ ర్యాలీ..
ఈ మేరకు తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు ప్రజాప్రతినిధులను ఈ నెల (జనవరి) 11 వ తేదీన ఆర్ ఆర్ చౌరస్తా నుంచి శివాజినగర్లోని శంకర్ భవన్ పాఠశాల వరకు భారీ ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం పాఠశాలలో ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం చేపడతామన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని మున్నూరు కాపులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. ఈ సన్మాన కార్యక్రమం ద్వారా మున్నూరు కాపుల ఐక్యతను చాటుకుందామని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆకుల చిన్న రాజేశ్వర్, ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.