అక్షరటుడే, ఇందూరు: Dharmapuri Sanjay | మున్నూరు కాపులకు అండగా ఉంటానని ధర్మపురి సంజయ్ పేర్కొన్నారు. మున్నూరు కాపు సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన సందర్భంగా మాట్లాడారు.
Dharmapuri Sanjay | రాజకీయ ప్రముఖులు..
నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ ఆదివారం నగరంలో ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారుడు, ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, షబ్బీర్ అలీ, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, తాహెర్‌బిన్ హందాన్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ధర్మపురి సంజయ్ మాట్లాడారు. తన తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ఆశయాలను నెరవేరుస్తానని పేర్కొన్నారు. తన తండ్రిపై ఉన్న అభిమానంతో తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మున్నూరు కాపు సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
