Homeక్రీడలుDhanasree | పెళ్లైన రెండో నెల‌లోనే అత‌డు దొరికిపోయాడు.. చాహ‌ల్‌పై ధ‌న‌శ్రీ సంచ‌ల‌న కామెంట్స్

Dhanasree | పెళ్లైన రెండో నెల‌లోనే అత‌డు దొరికిపోయాడు.. చాహ‌ల్‌పై ధ‌న‌శ్రీ సంచ‌ల‌న కామెంట్స్

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Dhanasree | క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ , కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ ప్రేమ వివాహం, ఆ తరువాత విడాకులు.. ఇదంతా ఇప్పటికే చాలా మందికి తెలిసిన‌ కథ.

అయితే ఇప్పుడు ధనశ్రీ(Dhanasree), ఓ రియాలిటీ షో వేదికగా ఆ పెళ్లి వెనక ఉన్న వాస్తవాలను ఒక్కొక్కటిగా బయటపెడుతూ ఈ జంట పేరు మీడియా హెడ్‌లైన్స్‌లోకి తీసుకువచ్చింది. కోవిడ్ సమయంలో డ్యాన్స్ క్లాసులో చాహల్(Chahal)-ధనశ్రీ మధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి, ఆ త‌ర్వాత అది ప్రేమగా మారి, పెద్దల అంగీకారంతో వివాహం జ‌రిగింది. సోషల్ మీడియాలో ఈ జంట అప్పట్లో అందరి అభిమానాన్ని గెల్చుకుంది. కానీ ఆ హ్యాపీ మ్యారేజ్ కేవలం నాలుగేళ్లలోనే ముగిసింది.

Dhanasree | రియాలిటీ షోలో సంచలనం

ఇటీవల ‘రైజ్ అండ్ ఫాల్’ అనే రియాలిటీ షోలో పాల్గొన్న‌ ధనశ్రీ, తన విడాకుల వెనుక కారణాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ హోస్ట్ చేస్తున్న ఈ షోలో, సహ పోటీదారు కుబ్రా సైత్ అడిగిన ఓ ప్రశ్నకు ధనశ్రీ సెన్సేషనల్ రెస్పాన్స్ ఇచ్చింది. పెళ్లైన ఏడాదిలో రెండవ నెలలోనే అతను దొరికిపోయాడు అని ధనశ్రీ చెప్పింది. అయితే ఏ విష‌యంలో దొరికాడు? ఏం జరిగింది? అనే విషయాన్ని మాత్రం ధనశ్రీ గోప్యంగా ఉంచింది. ధనశ్రీ తనపై భ‌ర‌ణం (అలిమొనీ) విష‌యంలో వ‌చ్చిన పుకార్లను కూడా ఖండించింది. నాపై తప్పుడు ప్రచారం జరిగింది. కానీ నేను స్పందించాలనుకోను. విడాకులు పరస్పర అంగీకారంతోనే జరిగాయి అని ధనశ్రీ వెల్లడించింది.

ధనశ్రీ ఒకవైపు మాజీ భర్త చాహల్‌తో స్నేహం కొనసాగిస్తున్నాన‌ని చెబుతుంది. కానీ ప‌లు వేదికల‌పై చాహల్‌పై నెగటివ్ వ్యాఖ్యలు చేయడం, అతడి ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చడం లేదు. చాహల్ అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. రియాలిటీ షో కోసం పర్సనల్ లైఫ్‌ను సెన్సేష‌న‌లైజ్‌ చేయడం సరైంది కాదు, బంధం ముగిసింది అంటే గౌరవంతో వదిలేయాలి, టీఆర్పీ కోసం మాజీ భర్తను బలిచేస్తే, అది సమాజానికి తప్పు సంకేతం అవుతుంది అని కామెంట్ చేస్తున్నారు. విడాకుల అనంతరం ధనశ్రీ తన సినీ కెరీర్‌పై దృష్టి పెట్టింది. చాహల్ మాత్రం మళ్లీ క్రికెట్‌పై ఫోకస్ చేస్తున్నారు. ‘రైజ్ అండ్ ఫాల్’ షోలో ధనశ్రీ చేసే వ్యాఖ్యలు ఇంకా ఎన్నో చర్చలకు తావిస్తోంది.