- Advertisement -
Homeక్రీడలుChahal | ఏంటి.. చాహ‌ల్‌ని 60 కోట్ల రూపాయ‌లు భ‌ర‌ణంగా డిమాండ్ చేసిందా.. ధ‌న‌శ్రీ క్లారిటీ..!

Chahal | ఏంటి.. చాహ‌ల్‌ని 60 కోట్ల రూపాయ‌లు భ‌ర‌ణంగా డిమాండ్ చేసిందా.. ధ‌న‌శ్రీ క్లారిటీ..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chahal | టీమిండియా క్రికెటర్ యూజవేంద్ర చాహల్, నటి ధనశ్రీ ల విడాకులు ఎంత పెద్ద‌ చర్చనీయాంశంగా మారాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2020లో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జంట, ఈ ఏడాది ఫిబ్రవరిలో పరస్పర అంగీకారంతో విడిపోయారు.

అయితే విడాకుల(Divorce) తర్వాత వీరిద్దరిపై అనేక రకాల రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా, ధనశ్రీ 60 కోట్ల రూపాయల భరణం డిమాండ్ చేసిందనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వార్తలపై తాజాగా స్పందించిన ధనశ్రీ(Dhanashree), వాటిని పూర్తిగా ఖండించారు. ప్రస్తుతం రైజ్ అండ్ ఫాల్ అనే రియాల్టీ షోలో పోటీ పడుతున్న ఆమె, “నేను చాహల్‌తో విడిపోయినప్పటికీ ఆయన్ని ఇప్పటికీ గౌరవిస్తూనే ఉన్నాను అని చెప్పుకొచ్చింది.

- Advertisement -

Chahal | అస‌లు విష‌యం ఇది..

నేను 60 కోట్ల భరణం తీసుకున్నాననే వార్తలు పూర్తిగా అవాస్తవం. మేము పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం. అలాంటప్పుడు భరణం అనే అంశమే ఉండదు. అందుకే మా విడాకులు త్వరగా పూర్తి అయ్యాయి అని స్పష్టం చేశారు.అలాగే, “మా వ్యక్తిగత జీవితంపై ఎన్ని రూమర్లు వచ్చినా నేను మౌనం పాటించడం వల్లే కొందరు మరింత పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. మా గురించి ఏమీ తెలియకుండా ఇలాంటి వార్తలు సృష్టించడం వలన ఎవరికి ఉపయోగం లేదు. కానీ నాపై వచ్చిన 60 కోట్ల భరణం రూమర్లు మాత్రం చాలా బాధపెట్టాయి. వాటి వల్ల నేను నిజంగానే సఫర్ అయ్యాను అని ధనశ్రీ తెలిపింది.

దీంతో చాహల్–ధనశ్రీ విడాకులపై సాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలికినట్టైంది. అయితే ధనశ్రీ,చాహల్(Chahal) లు విడిపోయాక వారిద్ద‌రికి సంబంధించి ఎన్నో వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వారిరివురు వేరే వారితో రిలేష‌న్ పెట్టుకోవ‌డం వ‌ల‌న విడిపోయారంటూ కొంద‌రు ప్ర‌చారం చేశారు. ధ‌న‌శ్రీ పెళ్లైన కొద్ది రోజుల‌కే వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంద‌ని, అందుకే చాహల్ ఆమెను వదిలేసాడని కొంతమంది ప్రచారం చేస్తే.. మరికొంతమందేమో చాహల్ కి వేరే అమ్మాయితో రిలేషన్ ఉండ‌డం వ‌ల్ల‌నే, ధన శ్రీ అతన్ని వదిలించుకుందని సోలో లైఫ్ గ‌డుపుతుంద‌ని ఇంకొంత మంది ప్రచారం చేశారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News