Homeజిల్లాలుకరీంనగర్Karimnagar | డీఈవో ఆఫీస్​ సూపరింటెండెంట్​ సస్పెన్షన్​

Karimnagar | డీఈవో ఆఫీస్​ సూపరింటెండెంట్​ సస్పెన్షన్​

కరీంనగర్​ డీఈవో కార్యాలయం సూపరింటెండెంట్​పై అధికారులు వేటు వేశారు. జవాబు పత్రాలను విక్రయించిన డబ్బులను దుర్వినియోగం చేయడంతో చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karimnagar | కరీంనగర్​ డీఈవో (DEO) కార్యాలయంలో సూపరింటెండెంట్​గా పని చేస్తున్న వ్యక్తిపై అధికారులు వేటు వేశారు. గతంలో మూల్యాంకనం పేపర్ల అమ్మకానికి సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వరంగల్​ ఆర్జేడీ (RJD) సత్యనారాయణరెడ్డి తాజాగా చర్యలు తీసుకున్నారు.

కరీంనగర్​ విద్యాశాఖ కార్యాలయంలో ఎన్.నరసింహ స్వామి సూపరింటెండెంట్​గా పని చేస్తున్నారు. ఆయన గతంలో ACGEగా పని చేశారు. ఆ సమయంలో ఆయన పదో తరగతి జవాబు పత్రాలను విక్రయించి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. పదో తరగతి పేపర్లను మూల్యాంకనం అనంతరం పాత పేపర్లను అధికారులు విక్రయిస్తారు. అయితే నరసింహస్వామి పేపర్లు అమ్మిన డబ్బులను దుర్వినియోగం చేశారని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అధికారులు విచారణ చేపట్టారు.

Karimnagar | విచారణ అనంతరం

ప్రస్తుత సూపరింటెండెంట్​పై వచ్చిన ఆరోపణలపై అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. నిబంధనలను ఉల్లంఘించి నిధులను మళ్లించారని గుర్తించారు. అధికారాన్ని తప్పుదారి పట్టించారని, తన చట్టబద్ధమైన విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని తేల్చారు. దీంతో ఆయనను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.