Homeజిల్లాలుకామారెడ్డిBanswada RTC | బాన్సువాడ – కామారెడ్డి మధ్య డీలక్స్ బస్సు సర్వీసులు ప్రారంభం

Banswada RTC | బాన్సువాడ – కామారెడ్డి మధ్య డీలక్స్ బస్సు సర్వీసులు ప్రారంభం

బాన్సువాడ నుంచి కామారెడ్డి వరకు కొత్తగా డీలక్స్ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవి కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం వివరాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada RTC | ప్రయాణికుల సౌకర్యార్థం బాన్సువాడ నుంచి కామారెడ్డి (Banswada to Kamareddy) వరకు కొత్తగా డీలక్స్ బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవి కుమార్ తెలిపారు. ప్రతి రోజుకు నాలుగు సార్లు బాన్సువాడ, కామారెడ్డి మధ్య బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.

బాన్సువాడ నుంచి కామారెడ్డికి బయలుదేరే సమయాలు : ఉదయం 5.15, 9గంటలకు, మధ్యాహ్నం 12.45, సాయంత్రం 4.15 బయలుదేరుతుందని డీఎం తెలిపారు.

కామారెడ్డి నుంచి బాన్సువాడకు బయలుదేరే సమయాలు: ఉదయం 7.15 గంటలకు, 10.45 గంటలకు, మధ్యాహ్నం 2.15కు, సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుందని మేనేజర్​ పేర్కొన్నారు. కొత్త సర్వీసులతో ప్రయాణికుల (passengers) రాకపోకలు మరింత సులభతరమవుతాయని, ప్రయాణికులు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.