Weather Updates | దూసుకొస్తున్న సెన్యార్​ తుపాన్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతోంది. బుధవారం నాటికి ఇది తుపాన్​గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) అంచనా వేశారు. రాష్ట్రంలో నవంబర్​ రెండో వారం నుంచి చలి తీవ్రతతో ప్రజలు వణికిపోయారు. దాదాపు పది రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పది డిగ్రీల్లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో తేమతో […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతోంది. బుధవారం నాటికి ఇది తుపాన్​గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) అంచనా వేశారు.

రాష్ట్రంలో నవంబర్​ రెండో వారం నుంచి చలి తీవ్రతతో ప్రజలు వణికిపోయారు. దాదాపు పది రోజుల పాటు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పది డిగ్రీల్లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బంగాళాఖాతంలో తేమతో కూడిన వాతావరణంతో నాలుగు రోజులుగా చలి తగ్గింది. అయితే తుపాన్​ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Weather Updates | అతి భారీ వర్షాలు

వాయుగుండం బలపడి తుపాన్​గా మారిన తర్వాత దానికి సెన్యార్ (Senyar) అని పేరు పెట్టనున్నారు. ఇటీవల మొంథా తుపాన్​ సృష్టించిన బీభత్సానికి ఏపీతో పాటు తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. సెన్యార్​ తుపాన్​తో సైతం భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య దిశగా 2 వేల కిమీ దూరంలో వాయుగుండం కదులుతోంది. ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై తుపాన్​ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దన్నారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో నేడు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. తుపాన్​ ప్రభావంతో తెలంగాణలోని హైదరాబాద్‌తో (Hyderabad) పాటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్​ ఉంది.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.