అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cyber Fraud | దేశంలో సైబర్ నేరగాళ్లు (Cyber criminals) రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త పేరుతో ప్రజలు మోసం చేస్తున్నారు. సైబర్ నేరాల బారిన పడుతున్న వారిలో విద్యావంతులు, ఉద్యోగులు అధికంగా ఉంటున్నారు.
సైబర్ నేరగాళ్లు ఏకంగా మాజీ ఐఏఎస్ (former IAS officer) భార్యకు టోకరా వేశారు. ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో రూ. 2.58 కోట్ల మోసం చేశారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చిట్కాలు (stock market trading tips) ఇస్తామని ఆమె వాట్సాప్‌కు మెసేజ్ వచ్చింది. దీంతో తనకు అవగాహన లేక తన భర్తను వాట్సాప్ గ్రూప్‌లో ఆమె యాడ్ చేయించారు.
Cyber Fraud | నకిలీ సెబీ సర్టిఫికెట్లతో..
సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో నకిలీ సెబీ సర్టిఫికెట్లు (SEBI certificates) పంపించారు. దీంతో సదరు మాజీ ఐఏఎస్ భార్య నిజమేనని నమ్మారు. వారు చెప్పినట్లు పెట్టుబడులు పెట్టారు. డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకూ 19 ట్రాన్సాక్షన్లలో రూ. 2.58 కోట్లు సైబర్ నేరగాళ్లు చెప్పిన ఖాతాల్లోకి బదిలీ చేశారు. తీరా మోసపోయానని గ్రహించి తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు (Hyderabad Cyber Crime police) ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Cyber Fraud | వారే అధికం
సైబర్ నేరగాళ్లు చాలా వరకు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్‌ల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. నిందితులు ఎక్కువగా హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు. దీంతో ఆ భాషలు వచ్చిన వారు ఎక్కువగా మోసపోతున్నారు. అలాగే స్టాక్ మార్కెట్ గురించి ఉద్యోగులు, విద్యావంతులకే అవగాహన ఉండటంతో.. నిందితులు చెప్పిన మాటలను నమ్ముతున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు వస్తాయని ఆశించి వారి చెప్పినట్లు పెట్టుబడులు పెడుతున్నారు. తీరా మోసపోయామని తెలుసుకొని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా.. ప్రజలు మోసపోతుండటం గమనార్హం.