అక్షరటుడే, వెబ్‌డెస్క్: Crisis in Karnataka Congress | కర్ణాటక Karnataka రాజకీయాల్లో మరోసారి ముఖ్యమంత్రి మార్పు అంశం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్న నేపధ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇచ్చే అంశంపై ఆయన వర్గం మళ్లీ ఒత్తిడి తెరపైకి తీసుకువచ్చింది.
ఈ సమస్యను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం.
Crisis in Karnataka Congress | సిద్ధరామయ్యకు బదులుగా శివకుమార్?
గత కొన్నినెలలుగా సీఎం మార్చే అంశం కాంగ్రెస్‌లో చర్చకు దారి తీస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో “2.5 సంవత్సరాలు సిద్ధరామయ్య, తర్వాత డీకే శివకుమార్” ఫార్ములా అమల్లో ఉంటుందని ఆ వర్గం చెబుతున్నారు.
కానీ, సిద్ధరామయ్య–శివకుమార్ ఇద్దరూ ఈ సమాచారాన్ని పబ్లిక్‌గా పలుమార్లు ఖండించారు. అయినప్పటికీ అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా డీకే శివకుమార్ DK Shivakumarవర్గం ఎమ్మెల్యేలు సీఎం మార్పు కోసం ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీకి బయలుదేరారు.
ముందుగా ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి డిమాండ్‌ను తెలియజేయనున్నారు.ఈ ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్‌ను కూడా కలవడానికి షెడ్యూల్ ఖరారైనట్లు సమాచారం.
ఢిల్లీకి ఇప్పటికే చేరిన కీలక ఎమ్మెల్యేలలో దినేశ్ గూలిగౌడ, రవి గణిగ, గుబ్బి వాసు ఉన్నారు. ఈ రోజు ఉదయం అనేకల్ శివన్న, నేలమంగళ శ్రీనివాస్, ఇక్బాల్ హుస్సేన్, కునిగల్ రంగనాథ్, శివగంగ బసవరాజు, బాలకృష్ణ తదితరులు చేరుకోనున్నారు.
ఢిల్లీ ప్రయాణంపై స్పందించిన ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ .. నేను ఢిల్లీకి వెళ్లి బంగారం, వజ్రాలు Diamonds అడుగుతానా? మా నాయకుడు డీకే శివకుమార్ కోసమే వెళుతున్నాను అని జాతీయ మీడియాతో చెప్పారు.
ఇదే సమయంలో డీకే శివకుమార్ సోదరుడు సురేశ్ కూడా స్పందిస్తూ .. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం అంటూ వ్యాఖ్యానించారు.
