అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cardiac Arrest | ఇటీవల ఆటలు ఆడుతూ, వ్యాయామాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయే ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. నెలకు ఒక్కసారైనా ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో ఓ యువ క్రికెటర్ (Young Cricketer) గుండెపోటుతో మృతి చెందిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఘటనకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. వీడియో ప్రకారం.. టెన్నిస్ బాల్ క్రికెట్ మ్యాచ్(Tennis Ball Cricket Match)లో ఓ బ్యాటర్ భారీ సిక్స్ బాదిన అనంతరం మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఇతర క్రికెటర్లు అతనికి CPR ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రికి తరలించినా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి వయసు సుమారు 30-35 ఏళ్ల మధ్యగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Cardiac Arrest | కుప్పకూలిపోయాడు..
ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం స్పష్టంగా తెలియకపోయినా, అది ఒక స్థానిక టోర్నీలో చోటు చేసుకున్నదిగా అర్థమవుతోంది. ‘రిచర్డ్ కెటిల్‌బరో’ పేరిట నడుస్తున్న ఓ ఫేక్ క్రికెట్ అకౌంట్ ఈ వీడియోను షేర్ చేసింది. ఇది అసలైన కెటిల్‌బరో ఖాతా కాదన్న విషయం స్పష్టమైనా, ఇప్పటికే లక్షలాది మంది దీనిని ఫాలో అవుతున్నారు. వీడియో చూసినవారంతా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనూ చాలానే చోటు చేసుకున్నాయి. పంజాబ్‌లో టోర్నీ సందర్భంగా ఓ క్రికెటర్, బెంగాల్‌లో ఓ క్రికెటర్ జిమ్ చేస్తూ, హైదరాబాద్‌లో ఓ యువకుడు బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో మరణించారు.
ఇలాంటి మరణాలపై కార్డియాలజిస్టులు(Cardiologists) ఏమంటున్నారు అంటే తీవ్రమైన శారీరక వ్యాయామాలు, సరైన ఫిట్‌నెస్ అవగాహన లేకుండా చేసే శ్రమ గుండెపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుందంటున్నారు. యువకుల్లోనూ గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయని, చిన్న వయస్సులోనే స్క్రీనింగ్ అవసరమని సూచిస్తున్నారు. ఈ ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తోంది. వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
A batter died of cardiac arrest after hitting a six 😨 pic.twitter.com/kJaFIrIVCw
— Richard Kettleborough (@RichKettle07) August 24, 2025