అక్షరటుడే, బోధన్: CP Sai chaitanya | మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) గోదావరిలోకి ఉధృతంగా వరద వస్తోంది. దీంతో జిల్లాలోని కందకుర్తి (Kandakurthi), తదితర పుష్కర ఘాట్ల (Pushkara Ghats) వద్ద వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai chaitanya) సోమవారం ఆయా పుష్కరఘాట్లను పర్యవేక్షించారు.
బోధన్ డివిజన్ పరిధిలోని రెంజల్ మండలంలోని (Renjal Mandal) కందకుర్తి గ్రామ సమీపంలో కందకుర్తి గోదావరి వంతెనను సీపీ సాయిచైతన్య పరిశీలించారు. కందకుర్తి వద్ద ఎగువన నిజాంసాగర్ కెనాల్ (Nizamsagar Canal) నుండి భారీగా వస్తున్న వరద కారణంగా పాత వంతెన పూర్తిగా మునిగిపోయింది. ఈ ప్రాంతాన్ని సీపీ పరిశీలించి స్థానిక పోలీసులకు పలు సూచనలు సలహాలు అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Meteorological Department) సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం వద్దకు రాకూడదని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో సంబంధిత రెంజల్ పోలీస్ స్టేషన్ గాని డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూం 8712659700 సంప్రదించాలని తెలియజేశారు.
బోధన్ ఏసీపీ పి.శ్రీనివాస్ (Bodhan ACP P Srinivas), బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, రెంజల్ ఎస్సై చంద్ర మోహన్, మండల వ్యవసాయ అధికారి సిద్ధి రామేశ్వర్, ఏఈవో గోపికృష్ణ తదితరులు సీపీ వెంట ఉన్నారు.