Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Councillor Fulfills Promises | మున్సిపల్​ ఎన్నికల్లో (Municipal Elections) ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందింస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అనేకమంది గెలిచిన తర్వాత నిర్లక్ష్యం చేస్తుండగా ఎల్లారెడ్డి పట్టణంలో ఎనిమిదో వార్డు కౌన్సిలర్​గా గెలిచిన స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా (Siddhi Sridhar Gupta) తానిచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారు.

Councillor Fulfills Promises | పట్టణంలోని ఎనిమిదో వార్డులో..

ఇటీవల జరిగిన ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో (Yellareddy Municipal Elections) ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సిద్ది శ్రీధర్ గుప్తా అఖండ విజయం సాధించారు. ప్రధాన పార్టీ అభ్యర్థులను ఓడించి ఓటర్ల అభిమానాన్ని చూరగొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ది శ్రీధర్ గుప్తా తన వార్డు పరిధిలో ప్రతి ఆడబిడ్డ వివాహానికి రూ.11,000 వేలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని హామీని గురువారం అమలు చేశారు. వార్డులోని ముశెట్టి నాగరాజ్, అనిత దంపతుల కుమార్తె ముశెట్టి హర్షిత వివాహం అజయ్​తో గురువారం జరిగింది.

ఇచ్చిన హామీ మేరకు..

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముశెట్టి హర్షితకు రూ.11వేలతో పాటు వస్త్రాలను సిద్ది శ్రీధర్ గుప్తా, స్నేహ గుప్తా దంపతులు అందజేశారు. సిద్ది శ్రీధర్ గుప్తా మేనిఫెస్టోకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఘోర పరాజయం పొందారు. ఎనిమిదో వార్డు ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఆడపిల్ల వివాహానికి రూ.11000, అంతక్రియలకు రూ.10,000, ఆడపిల్ల జన్మిస్తే రూ.11,000, ఆర్నెళ్లకు ఒకసారి ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేస్తానని సిద్ది శ్రీధర్ గుప్తా ప్రకటించారు. అలాగే ఎనిమిదో వార్డు ప్రజల కోసం బాడీ ఫ్రీజర్​ను సమకూరుస్తానని హామీ ఇచ్చారు. వార్డులో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే ఎలాంటి అవినీతికి తావు లేకుండా అనుమతులు ఇప్పిస్తానని ఆయన వివరించారు. ఇచ్చిన హామీలు మరిచిపోయే రాజకీయ నాయకులు ఉన్న ఈ సమయంలో హామీలను నెరవేర్చేందుకు నడుంబిగించిన సిద్ది సిధర్ గుప్తాను పలువురు అభినందిస్తున్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.

Kharge Jaggareddy Meeting | ఖర్గేను కలిసిన జగ్గారెడ్డి.. రాజ్యసభ సభ్యులపై వినతి

కాంగ్రెస్​ జాతీయ​ అధ్యక్షుడు మల్లికార్జున్​ ఖర్గేను జగ్గారెడ్డి కలిశారు. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల్లో వి హనుమంత్​రావు, జెట్టి కుసుమకుమర్​కు అవకాశం ఇవ్వాలని కోరారు.