అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kalvakuntla Kavitha | సింగరేణి (Singareni)లో ప్రతి కాంట్రాక్ట్‌లో భారీగా అవినీతి జరుగుతోందని తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అందులో నుంచి కాంగ్రెస్ నాయకులకు వాటా వెళ్తోందని ఆమె ఆరోపణలు చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ (Hyderabad)లోని సింగరేణి భవన్ని ముట్టడించారు.
తెలంగాణ జాగృతి, హెచ్ఎంఎస్ (HMS) ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడి చేపట్టారు. కవిత మాట్లాడుతూ.. కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలు కూడా తీసేస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి కవిత ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ (Nampalli Police Station)కు తరలించారు.
Kalvakuntla Kavitha | న్యాయం జరిగే వరకు పోరాటం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రజల గొంతులను నొక్కేస్తుందని కవిత విమర్శించారు. తనను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యక్తీకరణ పట్ల ప్రభుత్వానికి పెరుగుతున్న అసహనాన్ని సూచిస్తోందన్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల (Dependent jobs)ను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
Kalvakuntla Kavitha | వేలాన్ని నిలిపివేయాలి
రాష్ట్రంలో బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్త బ్లాకులను సింగరేణికి మాత్రమే కేటాయించాలన్నారు. సింగరేణిలో కాంట్రాక్ట్‌లో అవినీతి జరుగుతుందన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకపోతే తాము సీబీఐకి ఫిర్యాదు చేస్తామన్నారు. సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.
