అక్షరటుడే, కామారెడ్డి : Cordon Search | పట్టణంలోని బతుకమ్మకుంటలో (Bathukammakunta) కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని గురువారం తెల్లవారు జామున నిర్వహించారు. కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి (ASP Chaitanya Reddy) ఆధ్వర్యంలో ఉదయం 4 గంటల నుంచి 200 మంది సిబ్బందితో తనిఖీలు చేపట్టారు.
Cordon Search | 235 వాహనాలు స్వాధీనం..
ఈ సందర్భంగా నిర్వహించిన కార్డన్ సెర్చ్‌లో (Cordon Search) నంబర్ ప్లేట్ లేనివి, ట్రాఫిక్ నియమాలు పాటించని 235 బైక్‌లు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసం పోలీసుల నిరంతర చర్యలు ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు (Traffic Rules) పాటించాలని ఆమె సూచించారు.
