అక్షరటుడే, వెబ్డెస్క్ : Delhi Blast | ఢిల్లీలోని ఎర్రకోట (Red Fort) సమీపంలో కారు పేలుడు ఘటనపై దర్యాపు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డిసెంబర్ 6న పలు ప్రాంతాల్లో కార్లను ఉపయోగించి వరుస ఉగ్రదాడులకు నిందితులు స్కెచ్ వేసినట్లు అధికారులు గుర్తించారు.
ఢిల్లీ (Delhi)లోని రద్దీ ప్రాంతాల్లో నాలుగు కార్లతో దాడులు చేయాలని ఉగ్రవాదులు ప్లాన్ చేశారు. ఢిల్లీ పేలుడు తరహాలనే వీటిని జరపాలని పన్నాగం పన్నారు. ఈ మేరకు కార్లను కూడా కొనుగోలు చేశారు. ఎక్కువ సార్లు చేతులు మారిన పాత కార్లను సమకూర్చుకున్నారు. దీంతో పోలీసులు (Delhi Police)ట్రేస్ చేయకుండా ఉంటుందని వారు భావించారు. కార్లలో పేలుడు పదార్థాలు పెట్టి దాడులకు పాల్పడాలని ప్లాన్ వేశారు. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు (Babri Masjid) కూల్చివేతకు ప్రతీకారంగా ఈ దాడులకు కుట్ర పన్నినట్టు సమాచారం.
Delhi Blast | కార్లు స్వాధీనం
ఉగ్రవాదులు దాడుల కోసం సిద్ధం చేసిన కార్లను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ‘DL 10 CK 0458’ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport) కారును బుధవారం పోలీసులు సీజ్ చేశారు. అందులో నిద్రిస్తున్న వ్యక్తిని సైతం అరెస్ట్ చేశారు. మరో డిజైర్ కారును సోమవారం పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కారులో రైఫిల్, తుపాకీ గుండ్లు లభించాయి. బ్రెజా కారును ఫరిదాబాద్ (Faridabad)లోని ఆల్ఫాలాహ్ మెడికల్ సైన్సెన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రాంగణంలో దొరికింది. కాగా ఢిల్లీలో హ్యుందాయ్ ఐ 20 కారుతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారు.
Delhi Blast | యూనివర్సిటీకి నోటీసులు
ఉగ్రమూలాలు బయటపడిన అల్-ఫలా యూనివర్సిటీకి అధికారులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వర్సిటీ వెబ్‌సైట్‌లో నకిలీ అక్రిడేషన్ చూపించడంపై న్యాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లేని గుర్తింపును ఎలా చూపిస్తారని ప్రశ్నించింది. ఫాల్స్ అక్రిడేషన్‌పై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది.
