అక్షరటుడే, బాన్సువాడ: Mla Pocharam | పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు(Indiramma Houses) అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ(Banswada) పట్టణంలోని తన నివాసంలో బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు రూ. 37.70 లక్షల డబుల్ బెడ్ రూం(Double Bed Room) ఇళ్ల నిర్మాణానికి సంబంధించి డబ్బులు అందజేశారు. లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ బిల్లులు అందిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీర్కూర్ మాజీ ఎంపీపీ రఘు, మాజీ ఎంపీటీసీ సందీప్ పటేల్, శశికాంత్, బాబా, రాములు, బోయిని శంకర్ తదితరులు పాల్గొన్నారు.
