206
అక్షరటుడే, ఆర్మూర్:Armoor | ఆటో బోల్తాపడి పలువురికి గాయాలైన ఘటన ఆలూర్ మండల(Alur Mandal) కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్‌కు చెందిన సుమారు ఏడుగురు మహిళలు శనివారం తెల్లవారుజామున ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం(Municipal Office)లో పనినిమిత్తం ఆటోలో బయలుదేరారు. గుగుపల్లి శివారులోని దర్గా వద్దకు రాగానే పంది అడ్డురాగా తప్పించే క్రమంలో ఆటో బోల్తాపడింది. దీంతో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు ఫోన్ చేయగా క్షతగాత్రుడిని నిజామాబాద్‌లోని జీజీహెచ్(GGH)కు తరలించారు.