అక్షరటుడే, వెబ్‌డెస్క్: Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఫైర్ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్రం ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) చేపట్టిన విషయం తెలిసిందే. కాగా.. కేంద్రం యుద్ధాన్ని అర్ధంతరంగా ఎందుకు ఆపేసిందని దుయ్యబట్టారు. పాక్(Pakistan)ను అంతం చేస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ నేతలు(BJP Leaders).. యుద్ధాన్ని ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేశారు.. మరి, మోదీ ఏం చేశారన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంపై ప్రధానికి ఉన్న శ్రద్ధ దేశ భద్రతపై లేదని విమర్శించారు.
Mallikarjun Kharge | దేశం కోసం గాంధీ కుటుంబం ప్రాణాలిచ్చింది..
దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఖర్గే(Mallikarjun Kharge) పేర్కొన్నారు. ‘గాంధీ కుటుంబంలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చినవాళ్లు ఉన్నారు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో అలాంటివాళ్లు ఉన్నారా..’ అని వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ ఖండించిందని.. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్థించిందని పేర్కొన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ నేతలు(Congress Leaders) అన్ని దేశాలు తిరిగి ప్రచారం చేశారని గుర్తు చేశారు.
Mallikarjun Kharge | అమెరికా యుద్ధనౌకలను పంపినా బెదరని ఇందిరా గాంధీ
1971 ఇండియా – పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిందని ఖర్గే గుర్తు చేశారు. ఆ సమయంలో అమెరికా యుద్ధనౌకలను పంపినా కూడా ఇందిరా గాంధీ బెదరకుండా యుద్ధాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ పాకిస్తాన్ రెండు ముక్కలుగా చేశారన్నారు. మరి మోదీ(PM Modi) ప్రస్తుతం ఏం చేశారని ప్రశ్నించారు.