అక్షరటుడే, ఆర్మూర్ : Aloor | గంగపుత్రుల ఉన్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కృషి చేస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆలూరు మండల కేంద్రంలోని (Aloor Mandal) అన్ని గ్రామాలకు వందశాతం సబ్సిడీపై (Subsidy) చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.
చేపల పెంపకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. గ్రామాల చెరువుల్లో చేపపిల్లలను వదిలి ఉత్పాదకతను పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు.
కార్యక్రమంలో ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వైస్ మల్లారెడ్డి, కాంగ్రెస్ ఆలూర్ మండల అధ్యక్షుడు ముక్కెర విజయ, బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ అరుణ్, ఓబీసీ అధ్యక్షుడు నాడీశరం మల్లయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు సంజీవ్, చిరంజీవి, నాయకులు కిషన్, ఎల్ఐసీ గంగన్న, గంగారాం, ఒడ్డెన్న, పోశెట్టి, ఫీల్డ్ ఆఫీసర్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.
