Kamareddy SP | కానిస్టేబుల్ రవి కుటుంబానికి బీమా చెక్కు అందజేత

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | గాంధారికి చెందిన కానిస్టేబుల్ వడ్ల రవి విధి నిర్వహణలో భాగంగా గతేడాది కారు ఢీకొనడంతో మృతి చెందాడు. రవి మరణానంతరం ఆయన సతీమణికి కారుణ్య నియామకం కింద ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఉద్యోగం కల్పించారు. అయితే కానిస్టేబుల్ రవికి ఎస్​బీఐలో శాలరీ అకౌంట్ ఉండడంతో సంబంధిత బ్యాంక్ అధికారులు అతనికి మంజూరైన రూ.కోటి రూపాయల బీమా చెక్కును మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ […]

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy SP | గాంధారికి చెందిన కానిస్టేబుల్ వడ్ల రవి విధి నిర్వహణలో భాగంగా గతేడాది కారు ఢీకొనడంతో మృతి చెందాడు. రవి మరణానంతరం ఆయన సతీమణికి కారుణ్య నియామకం కింద ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఉద్యోగం కల్పించారు. అయితే కానిస్టేబుల్ రవికి ఎస్​బీఐలో శాలరీ అకౌంట్ ఉండడంతో సంబంధిత బ్యాంక్ అధికారులు అతనికి మంజూరైన రూ.కోటి రూపాయల బీమా చెక్కును మంజూరు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్​చంద్ర చేతుల మీదుగా రవి భార్యకు చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ అధికారులు మాట్లాడుతూ.. పోలీస్​గా విధులు నిర్వర్తిస్తున్న ప్రతి ఉద్యోగి ఎస్​బీఐలో శాలరీ ఖాతా తీసుకోవాలని సూచించారు. తద్వారా అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు బీమా అందుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి (Additional SP Narasimha Reddy), ఎస్​బీఐ నిజామాబాద్ డీజీఎం బిజయ్ కుమార్ సాహూ, కామారెడ్డి ఆర్ఎం వెంకటేశ్వర్లు, చీఫ్ మేనేజర్ సోమేశ్వర్ రావు, చీఫ్ మేనేజర్ వరప్రసాద్, హెచ్​ఆర్ మేనేజర్ రమణ, బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్ పాల్గొన్నారు.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.