Homeజిల్లాలుకామారెడ్డిKamaredy Collector | కలెక్టర్ సేవలు భేష్​.. ధర్మారెడ్డి గ్రామ ప్రజలు

Kamaredy Collector | కలెక్టర్ సేవలు భేష్​.. ధర్మారెడ్డి గ్రామ ప్రజలు

కొనుగోళ్ల సీజన్​ ప్రారంభమైన నెలలోపే ధాన్యం విక్రయాలను పూర్తి చేసిన కలెక్టర్​ సేవలు అభినందనీయమని ధర్మారెడ్డి గ్రామస్థులు పేర్కొన్నారు. కలెక్టరేట్​లో కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ను వారు సన్మానించారు.

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamaredy Collector | కొనుగోళ్ల సీజన్​ ప్రారంభమైన నెలలోపే ధాన్యం విక్రయాలను పూర్తి చేసిన కలెక్టర్​ సేవలు అభినందనీయమని ధర్మారెడ్డి గ్రామస్థులు (Dharma Reddy villagers) తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్​లో వారు జిల్లా పాలనాధికారి ఆశిష్​ సంగ్వాన్​ను (Collector Ashish Sangwan) సన్మానించారు.

ఇందిరా క్రాంతి పథకం (Indira Kranti scheme) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా వేగంగా ధాన్యం సేకరణ జరగడం, రైతుల వద్ద నుంచి ఒక గింజ కూడా నష్టపోకుండా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయడంపై రైతులు (Farmers) సంతృప్తి వ్యక్తం చేశారు. సకాలంలో చెల్లింపులు రావడంతో తమకు పెద్ద ఉపశమనంగా మారిందని వారు పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడంలో ధర్మారెడ్డి గ్రామ రైతులు చూపిన సహకారాన్ని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. రికార్డు స్థాయిలో పనితీరును ప్రదర్శించి జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలబెట్టడంలో ముఖ్య పాత్ర పోషించిన ఐకేపీసీసీ ఇన్​ఛార్జి కొమ్మ దత్తు, కేంద్ర సిబ్బంది, మహిళా సమాఖ్య కమిటీ సభ్యులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఏపీఎం రాంనారాయణ గౌడ్, రైతులు నారాయణ, దేవయ్య, సాయిబాబా, నారాయణ తదితరులు పాల్గొన్నారు.