Homeజిల్లాలునిజామాబాద్​Indiramma Sarees | ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్

Indiramma Sarees | ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్

ఎడపల్లిలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో చేపడుతున్న పంపిణీని పరిశీలించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్ : Indiramma Sarees | ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సోమవారం తనిఖీ చేశారు. ఐకేపీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి మహిళలకు ఇందిరమ్మ చీరలు (Indiramma Sarees) పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు.

ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి పారదర్శకంగా, సజావుగా జరగాలని కలెక్టర్​ ఆదేశించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి తెలంగాణ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ గౌరవప్రదమైన రీతిలో ప్రభుత్వం తరపున మహిళలకు చీరను అందించాలని సూచించారు. ఎలాంటి విమర్శలు, వివాదాలకు తావు లేకుండా, అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర పంపిణీ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. పంపిణీ ప్రక్రియను వేగంగా చేపట్టి నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ దత్తాద్రి (Tahsildar Dattadri), ఐకేపీ సిబ్బంది ఉన్నారు.