అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CMRF checks | ఆపదలో ఉన్నవారికి సీఎంఆర్‌ఎఫ్ ఎంతో ఉపయోగకరమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ (Government advisor Shabbir Ali ), పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
నగరంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో పలువురికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. వైద్య చికిత్సల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని నిరుపేదలకు అండగా నిలబడటం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రత్యేకత అని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి వారికి భరోసా ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ విధానమన్నారు.
CMRF checks | ప్రతి పేదవాడికి అండ..
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ (PCC President Mahesh Kumar Goud) మాట్లాడుతూ.. అనారోగ్యం పాలై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతి పేదవాడిని ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్‌ఎఫ్ ఒక గొప్ప వరమని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పారదర్శకంగా, పైసా ఖర్చు లేకుండా నేరుగా లబ్ధిదారులకు ఈ చెక్కులు అందుతున్నాయని తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులను గుర్తించి సహాయం అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, సీనియర్ నాయకులు నరాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.