అక్షరటుడే, వెబ్డెస్క్:CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. సోమవారం ఆయన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్(KC Venu Gopal)తో సమావేశం అయిన విషయం తెలిసిందే. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించారు.
అధిష్టానం నుంచి అనుమతి లభించడంతో పలువురికి పీసీసీ పదవులు(PCC positions) ఖరారు చేశారు. 27 మందిని ఉపాధ్యక్షులుగా, 69 మందిని ప్రధాన కార్యదర్శులుగా కాంగ్రెస్ నియమించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి.
CM Revanth Reddy | కీలక అంశాలపై చర్చ
తాజాగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై మంగళవారం కీలక సమావేశం జరుగుతోంది. ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge), లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో సమావేశం అయ్యారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఆయన చర్చిస్తున్నారు.
అలాగే రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారి గురించి సీఎం వారికి వివరించినట్లు సమాచారం. త్వరలోనే మరికొంత మంది సీనియర్లకు పార్టీ, ప్రభుత్వ పదవులపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే సమయంలో కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్న వారికి శాఖల కేటాయింపుతో పాటు పలువురికి శాఖల మార్పు ఉండవచ్చని సమాచారం.