Kuppam | సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో దారుణం

అక్షరటుడే, అమరావతి: Kuppam : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సీఎం చంద్రబాబు CM Chandrababu సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam constituency)లో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదని మహిళను ఓ టీడీపీ కార్యకర్త చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. చిత్తూరు జిల్లా – కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25) భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం రూ.80,000 అప్పు తీసుకున్నారు. […]

అక్షరటుడే, అమరావతి: Kuppam : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సీఎం చంద్రబాబు CM Chandrababu సొంత నియోజకవర్గం కుప్పం(Kuppam constituency)లో దారుణం చోటుచేసుకుంది. అప్పు తీర్చలేదని మహిళను ఓ టీడీపీ కార్యకర్త చెట్టుకు తాళ్లతో కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. చిత్తూరు జిల్లా – కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది.

నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష వయస్సు (25) భర్త తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 3 సంవత్సరాల క్రితం రూ.80,000 అప్పు తీసుకున్నారు. కాగా, అప్పు తీర్చలేక భార్య శిరీష (25), తన బిడ్డలను వదిలి తిమ్మరాయప్ప గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాడు.

దీంతో శిరీష కూలీ పనులు చేసుకుంటూ, పిల్లలను పోషించుకుంటూ అప్పులు తీరుస్తోంది. సకాలంలో డబ్బులు చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా.. మునికన్నప్ప అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన అప్పుడబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అనంతరం ఈడ్చుకొంటూ వెళ్లి తాడుతో బలవంతంగా చెట్టుకు శిరీషను కట్టేసి కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై పలువురు మండిపడుతున్నారు.

Naresh Chandan
Naresh Chandan
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

HYDRAA land protection | 2700 గ‌జాల భూమిని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | అక్రమార్కులపై హైడ్రా (Hydraa) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా నెక్నాంపూర్‌ (Neknampur)లో ప్ర‌భుత్వ భూమిని కాజేయాల‌ని...

Telangana Brahmotsavam | వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

బీర్కూర్ మండలం తిమ్మాపూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.

Councillor Fulfills Promises | మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్​.. హామీల అమలుపై ప్రశంసలు..

మున్సిపల్​ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కౌన్సిలర్​ను పలువురు అభినందిస్తున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఎనిమిదో వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థి సిద్ది శ్రీధర్​ గుప్తా విజయం సాధించారు

Indiramma Housing Scheme | పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

కాంగ్రెస్​ హయాంలో పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నామని ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​ఛార్జి వినయ్ రెడ్డి పేర్కొన్నారు. ఆలూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.