291
అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad Police | వ్యభిచార గృహాలపై సీసీఎస్ సిబ్బంది మెరుపుదాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య (CP Sai Chaitanya), ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని (Nizamabad City) ఆరో టౌన్ పరిధితో పాటు, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచారం గృహాలపై రైడ్ చేశారు. ఈ సమయంలో నలుగు విటులతో పాటు ఐదుగురు విటురాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 27,290లతో పాటు ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఆయా పోలీస్ స్టేషన్కు అప్పగించారు.