Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | బీఆర్ఎస్​ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

Kamareddy | బీఆర్ఎస్​ నాయకులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి

మాలవత్​ పూర్ణను పరామర్శించేందుకు వెళ్తున్న మంత్రి సీతక్కను అడ్డుకున్న బీఆర్​ఎస్​ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పర్వతారోహకురాలు మాలత్ పూర్ణను పరామర్శించడానికి వెళ్తున్న మంత్రి సీతక్కను (Minister Seethakka) అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్​అండ్​బీ గెస్ట్​హౌస్​లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన గిరిజన మంత్రి పర్వతారోహకులు మలావత్ పూర్ణను (mountaineer Malavat Poorna) పరామర్శించడానికి వెళ్తున్న క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, మరో ఇద్దరు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. పక్కనే ఉన్న వైన్స్​లో మద్యం సేవించి అక్కడున్న వారిని ఉసిగొల్పి కాన్వాయికి అడ్డుగా వచ్చారని ఆరోపించారు.

కారు డ్రైవర్ అప్రమత్తతతో మంత్రికి ప్రమాదం తప్పిందన్నారు. గిరిజన మంత్రిని అడ్డుకున్న మాజీ ఎంపీపీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు (SC and ST atrocity case) నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, దానికి ఇది సమయం కాదన్నారు. కాన్వాయిని అడ్డుకునే క్రమంలో ఏదైనా జరిగితే మంత్రిపై నింద వేసి ఆమెను బద్నాం చేసే కుట్ర చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్​ను బద్నాం చేస్తే బీఆర్ఎస్​లో మరింత ప్రోత్సాహం ఉంటుందనే ఇలా చేసి ఉంటారన్నారు. ఈ ఘటన వెనక మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేపై కూడా కేసు నమోదు చేయాలన్నారు. కాన్వాయిని అడ్డుకున్న నాయకులు రెండు మూడు రోజుల్లోగా మంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే గిరిజనులంతా మాజీ ఎంపీపీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రానా ప్రతాప్, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం డివిజన్ అధ్యక్షుడు సదర్ నాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు రూప్ సింగ్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి బద్రీనాయక్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవి నాయక్, టౌన్ అధ్యక్షుడు రొత్వన్ మోహన్ నాయక్ పాల్గొన్నారు.