అక్షర టుడే బాన్సువాడ : Forest Department | అడవులలో జంతువులను లెక్కించే క్రమంలో వలంటీర్లు జాగ్రత్తలు పాటించాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎండీ హబీబ్ సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ఎస్ఆర్ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Government Degree College) అటవీ సంరక్షణ వలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. బాన్సువాడ రీజియన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కళాశాల బోటనీ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
Forest Department | టైగర్ ఎస్టిమేషన్పై..
ఫారెస్ట్ విభాగం ప్రతి ఏడాది నిర్వహించే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్పై (All India Tiger Estimation) అవగాహన కల్పించారు. బాన్సువాడ డివిజన్ పరిధిలోని అడవుల్లో వృక్షాలు, మొక్కలు, జంతువులు, పులులను లెక్కించేటప్పుడు వలంటీర్లు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. కార్యక్రమంలో సంతోష, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఐ.గంగాధర్, బోటనీ విభాగాధిపతి డాక్టర్ డి.రాజేష్, రేఖ, విట్టల్, కృష్ణ, పోతురాజు శ్రీనివాస్, బాన్సువాడ డివిజన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.