అక్షరటుడే, వెబ్‌డెస్క్: GHMC expansion | జీహెచ్‌ఎంసీ విస్తరణకు తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) ఆమోద ముద్ర వేసింది. మొత్తం 27 మున్సిపాలిటీలను విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సుమారు 4 గంటలకుపైగా వివిధ అంశాలపై చర్చించింది. కాగా.. మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాలను మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridhar Babu) మీడియాకు వివరించారు.
GHMC expansion | జీహెచ్ఎంసీలో విలీనం కానున్న మున్సిపాలిటీలివే..
జీహెచ్‌ఎంసీలో 27 మున్సిపాలిటీలు విలీనం కానున్నాయి. ఇందులో పెద్ద అంబర్‌పేట్, జల్‌పల్లి, తుర్కయంజాల్, మణికొండ, శంషాబాద్, నార్సింగి, ఆదిభట్ల, నాగారం, దమ్మాయిగూడ, మేడ్చల్, పోచారం, తూంకుంట, ఘట్‌కేసర్, గుండ్లపోచంపల్లి, బొల్లారం, తెల్లాపూర్, కొంపల్లి, దుండిగల్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, అమీన్‌పూర్, మీర్‌పేట, నిజాంపేట్, ఫిర్జాదిగూడ, బోడుప్పల్, జవహర్‌నగర్ మున్సిపాలిటీలు ఉన్నాయి.
GHMC expansion | మరో డిస్కమ్ ఏర్పాటుకు నిర్ణయం
సుదీర్ఘంగా సాగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో డిస్కమ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. కొత్త డిస్కమ్ పరిధిలోకి హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్స్ (Hyderabad Metro Water Supplies), లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లు, మిషన్ భగీరథ కనెక్షన్లు, వ్యవసాయ కనెక్షన్లు, వస్తాయని పేర్కొన్నారు. రానున్న పదేళ్లలో విద్యుత్ డిమాండ్‌కు అవసరమైన ఏర్పాట్లపై సమావేశంలో చర్చ జరిగిందని చెప్పారు. ఈ క్రమంలోనే మూడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించామని వివరించారు. ఇందుకోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు.
GHMC expansion | మరిన్ని కేబినెట్ నిర్ణయాలివే..
- రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణం
- పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ విభాగంలో పెట్టుబడుల ఆహ్వానించాలని నిర్ణయం
- కొత్త పరిశ్రమలకు సొంతగా విద్యుత్ తయారు చేసుకునేందుకు పరిష్మన్
- పాల్వంచ, మక్తల్‌లలో నూతన ప్లాంట్ల నిర్మాణాకి ఉన్న అవకాశాల పరిశీలన
- హైదరాబాద్‌ను మూడు సర్కిళ్లుగా డివైడ్ చేసి.. భూగర్భ కేబుల్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం
జూబ్లీహిల్స్‌తో పాటు రాష్ట్రంలో మరికొన్ని అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
