అక్షరటుడే, ఆర్మూర్/మెండోరా: KTR | ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad district) పత్తిరైతులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి.
జగిత్యాల మీదుగా జిల్లాలోకి అడుగపెట్టిన కేటీఆర్‌కు మెండోరా మండలంలోని పోచంపాడ్ ఎక్స్‌రోడ్ వద్ద ఎమ్మెల్యే వేములు ప్రశాంత్‌రెడ్డి (MLA Vemulu Prashanth Reddy) పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. మెండోరా మండల (Mendora mandal) కార్యకర్తలు శేఖర్ రెడ్డి, మిస్పా రాజు, భాస్కర్, పాషా తదితరులు పాల్గొన్నారు.
KTR | ఆర్మూర్ పట్టణంలో..
అనంతరం ఆయన ఆర్మూర్ పట్టణానికి (Armoor Town) చేరుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి, బాజిరెడ్డి జగన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికి సన్మానించారు. కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, పోల సుధాకర్, జీజీ రామ్, మీరా శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

