అక్షరటుడే, ఆర్మూర్: BRS Nizamabad | జిల్లాలో ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివస్‌ను (Deeksha Divas) విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 26న సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
BRS Nizamabad | తెలంగాణ చరిత్రలో..
తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి అన్నారు.
BRS Nizamabad | రాష్ట్ర ఏర్పాటు సాధనలో..
కేసీఆర్ ఆమరణ దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్ల గురించి చర్చించేందుకు సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు జీవన్ రెడ్డి వివరించారు. సమావేశంలో మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy), మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్, షకీల్‌లతో పాటు జిల్లా ప్రముఖ నాయకులు, పార్టీ అన్ని మండలాల అధ్యక్షులు పాల్గొంటారని జీవన్ రెడ్డి వెల్లడించారు.
