Homeతాజావార్తలుbrain stroke | మాజీ కౌన్సిలర్​కు బ్రెయిన్​ స్ట్రోక్​.. అవయవ దానంతో మరికొందరికి ప్రాణదానం!

brain stroke | మాజీ కౌన్సిలర్​కు బ్రెయిన్​ స్ట్రోక్​.. అవయవ దానంతో మరికొందరికి ప్రాణదానం!

brain stroke | బ్రెయిన్​ స్ట్రోక్​తో మాజీ కౌన్సిలర్​ కన్నుమూశారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: brain stroke | బ్రెయిన్​ స్ట్రోక్​తో మాజీ కౌన్సిలర్​ కన్నుమూశారు. ఈ ఘటన నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ మున్సిపాలిటీ Armur Municipality పరిధిలో చోటుచేసుకుంది.

Nizamabad district ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ గ్రామానికి చెందిన మాజీ కౌన్సిలర్​ (ఏడో వార్డు) ఇట్టేడి నర్సారెడ్డి బ్రెయిన్​ స్ట్రోక్​తో మరణించారు.

brain stroke | వైద్యుల సూచనతో..

వైద్యుల సూచన మేరకు ఆయన కుటుంబం అవయవ దానానికి ముందుకొచ్చారు. నర్సారెడ్డి సతీమణి సునీత అంగీకారంతో బాధిత రోగులకు అవయవాలను అందజేశారు. అలా నర్సారెడ్డి చనిపోతూ మరికొందరికి ప్రాణం పోశారు.

Former councilor నర్సారెడ్డి మృతిపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రద్ధాంజలి ఘటించారు.