అక్షరటుడే, భీమ్గల్: Bheemgal | చొక్కయాద్రి (చొక్కయ్య గుట్ట) బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు, అర్చకులు సింహాగ్రి స్వామి తెలిపారు. ఈ మేరకు బుధవారం చొక్కయ్య గుట్టపై (Chokkayya Gutta) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈనెల 21న ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 21న ఉదయం స్వామి ఉత్సవ విగ్రహాలు గ్రామాలయం నుంచి గుట్టపైకి ఎదుర్కోలు కార్యక్రమం ఉంటుందన్నారు. 22న ఉదయం ప్రాభోదిక, విశ్వక్షేన విధి, అభిషేకం, ఎదుర్కోలు శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం (Sri Venkateswara Swamy Kalyana Mahotsavam), మహాపూర్ణహుతి, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ, స్వామి వారికి ఉంజల్ సేవ, స్వామి కీర్తనలు తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
23న సత్యనారాయణ వ్రతం, సహస్ర నామ పారాయణం, స్వామి ఉత్సవ మూర్తులను కొండపై నుండి గ్రామాలయానికి చేర్చడంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. మూడు రోజుల పాటు కొండపై నిర్వహించే ఉత్సవాల్లో అన్నప్రసాదం (Annaprasadam), తీర్థ ప్రసాదం అందజేస్తామన్నారు.
