అక్షరటుడే, నిజాంసాగర్: Borewell : కామారెడ్డి జిల్లా (Kamareddy district) మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలో పైడి ఎల్లారెడ్డి యువ సైనికులు (Paidi Yella Reddy Yuva Sainiks), బజరంగదల్ Bajrangdal, శివాజీ యూత్(Shivaji Youth) ఆధ్వర్యంలో గంగపుత్ర (Gangaputra) కాలనీలో బోరుబావిని తవ్వించారు. గత కొన్ని రోజులుగా కాలనీవాసులు నీటి ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పరిస్థితి గమనించిన పైడి ఎల్లారెడ్డి యువ సైన్యం గ్రామ పెద్దల సహకారంతో ఆదివారం రాత్రి బోరుబావి తవ్వించారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు అంజయ్య, మాజీ సర్పంచి సంఘమని రాములు, బీసీ సెల్ BC cell అధ్యక్షులు రాజేష్ యాదవ్, సాయాగౌడ్, సాయిబాబా, ముదిరాజ్ సంఘం నేతలు బాలు, అశోక్, మోహన్, గంగపుత్ర కాలనీ వాసులు, గుల సంతోష్, రమేశ్, హన్మాండ్లు, అంజయ్య, విఠల్, వెంకట్, సాయిలు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.