అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bomb Threat Mail | మరో విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. లండన్ నుంచి శంషాబాద్ (London to Shamshabad) వచ్చిన బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌లో బాంబు ఉన్నట్లు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు తనిఖీలు చేపట్టారు.
బ్రిటిష్ ఎయిర్‌లైన్స్‌కు (British Airlines) చెందిన ఓ విమానం సోమవారం ఉదయం లండన్ నుంచి శంషాబాద్ వచ్చింది. అయితే విమానం గాలిలో ఉండగానే.. బాంబు ఉన్నట్లు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పైలెట్‌కు సమాచారం అందించారు. దీంతో పైలెట్ విమానాన్ని ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Bomb Threat Mail | బాంబ్ స్క్వాడ్‌తో తనిఖీలు
విమానం ల్యాండ్ కాగానే.. పోలీసులు, అధికారులు ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ (bomb squad), డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. ఫ్లైట్ మొత్తం సోదాలు చేపట్టగా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో నకిలీ మెయిల్‌గా గుర్తించారు. బెదిరింపు మెయిల్‌పై ఎయిర్పోర్ట్ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Bomb Threat Mail | నిత్యం బెదిరింపులు
దేశంలో ఇటీవల బాంబు బెదిరింపు ఘటనలు పెరిగాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులు, విమానాల్లో బాంబు పెట్టినట్లు దుండగులు ఫోన్లు చేస్తున్నారు. మెయిల్స్, సందేశాలు పంపుతున్నారు. కోర్టులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సైతం బాంబులు పెట్టినట్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయితే ఇందులో దాదాపు అన్ని నకిలీ కాల్స్ ఉంటున్నాయి. ఫలితంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు, అధికారుల సమయం కూడా వృథా అవుతోంది. అయితే ఇలా బెదిరింపులకు పాల్పడే వారిని పట్టుకుందామంటే విదేశాల నుంచి మెయిల్స్ పంపుతున్నారు.
