HomeజాతీయంDharmendra | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Dharmendra | బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్నుమూత

బాలీవుడ్​ దిగ్గజ నటుడు ధర్మేంద్ర సోమవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ఆస్పత్రిలో చనిపోయారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Dharmendra | బాలీవుడ్​ దిగ్గజ నటుడు ధర్మేంద్ర కన్ను మూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చనిపోయారు. పది రోజుల క్రితం ముంబైలోని (Mumbai) ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇటీవల డిశ్చార్జి అయ్యారు. ఇవాళ మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు.

ధర్మేంద్రకు (Dharmendra) కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యం విషమించడంతో ఇటీవల ఆస్పత్రిలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన.. చివరకు 89 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచారు. ఆయన మృతితో బాలీవుడ్​లో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ (Film and political) ప్రముఖులు సంతాపం తెలిపారు.

Dharmendra | ప్ర‌యాణం ముగిసింది..

ధర్మేంద్రకు ఇద్ద‌రు భార్యలు ఉన్నారు. వారే ప్రకాశ్ కౌర్, హేమ మాలిని. బాలీవుడ్ హీరోలు సన్నీ డియోల్ మరియు బాబీ డియోల్ (Sunny Deol and Bobby Deol) ఆయన తొలి భార్య సంతానం. 1958లో దిల్ బీ తేరా హ‌మ్ బీ తేరే సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ధర్మేంద్ర, 60, 70 దశకాల్లో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసించారు. ‘షోలే’, ‘అలీబాబా ఔర్ 40 చోర్’, ‘దోస్త్’, ‘డ్రీమ్ గర్ల్’, ‘సన్నీ’, ‘గాయల్’, ‘లోఫర్’, ‘మేరా నామ్ జోకర్’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తన శక్తివంతమైన నటన, ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ఆయనను అభిమానులు ప్రేమగా ‘హీ-మ్యాన్ ఆఫ్ బాలీవుడ్’ అని పిలిచేవారు.

ధర్మేంద్ర మరణంతో సినీ ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో (Social Media) ఆయనకు నివాళులర్పిస్తున్నారు. “ఒక యుగం ముగిసింది. ధర్మేంద్ర చిరునవ్వు, ఆయన హ్యూమానిటీ ఎప్పటికీ గుర్తుండిపోతాయని పలువురు ప్రముఖులు పోస్టులు చేస్తున్నారు. హిందీ సినీ రంగాన్ని ఐదు దశాబ్దాల పాటు ఏలిన ఈ లెజెండరీ నటుడు ఇక లేరన్న వార్తతో బాలీవుడ్ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.