అక్షరటుడే, ఇందూరు : MP Dharmapuri Arvind | ఎన్నికల వేళ బీజేపీ జోరు కొనసాగుతోంది. ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో పలువురు నేతలు, కార్యకర్తలు కాషాయదళంలో చేరుతున్నారు.
పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్త రాజ్ గణేష్ సుమారు 300మందితో కలిసి గురువారం ఎంపీ అర్వింద్ సమక్షంలో బీజేపీలో (BJP) చేరారు. ఈ సందర్భంగా ఎంపీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. పార్టీ విస్తరణ కోసం రాజ్ గణేష్ (Raj Ganesh) గతంలో విశేషంగా కృషి చేశారన్నారు. తిరిగి పార్టీలోకి వచ్చిన ఆయన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.
MP Dharmapuri Arvind | కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
కేంద్ర ప్రభుత్వం (Central Government) అమలు చేస్తున్న పలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అర్బన్‌లో బీజేపీ కార్పొరేటర్ (BJP Corporator) అభ్యర్థులను గెలిపించుకునే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఎంపీ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari), పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎన్నికల ఇన్‌ఛార్జి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
1 comment
[…] పంచాయతీలకు గుడ్‌న్యూస్.. నిధులు… MP Dharmapuri Arvind | ఎన్నికల వేళ బీజేపీ జోరు….. Bhavani Bingi Rakesh | 24వ డివిజన్లో బీఆర్ఎస్ […]
Comments are closed.