అక్షరటుడే, ఇందూరు: Bhavani Bingi Rakesh | నగరంలోని 24వ డివిజన్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని ఆ పార్టీ అభ్యర్థిని భవాని బింగి రాకేష్ (Bhavani Bingi Rakesh) ధీమా వ్యక్తం చేశారు. తనను కార్పొరేటర్‌గా గెలిపిస్తే 24వ డివిజన్లో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు కానుక అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు గాయత్రినగర్‌లో గురువారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.
Bhavani Bingi Rakesh | పదేళ్లలో నగరంలో ఎంతో అభివృద్ధి..
బీఆర్ఎస్ అభ్యర్థిని భవాని బింగి రాకేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో నగరంలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతి ఇంట్లో లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు (welfare schemes) అమలయ్యాయని వివరించారు. తనను గెలిపిస్తే డివిజన్లో పుట్టిన ప్రతి ఆడబిడ్డకు సొంతంగా రూ.5వేలు అందజేస్తానన్నారు. అలాగే డివిజన్లో పెళ్లి చేసుకునే ప్రతి యువతికి రూ.5వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.
Bhavani Bingi Rakesh | డివిజన్‌ను అభివృద్ధి చేసి చూపిస్తాం..
వెన్నంటి ఉండి కష్టసుఖాల్లో పాలు పంచుకునేవారినే డివిజన్‌కు కార్పొరేటర్‌గా గెలిపించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనుక్షణం పేదలకు అండగా ఉంటానని.. డివజన్‌కు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

