అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy BJP | స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, బీజేపీ రాష్ట్ర నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, నేరెళ్ల ఆంజనేయులు, పైడి ఎల్లారెడ్డి అన్నారు. ఎల్లారెడ్డి పార్టీ కార్యాలయంలో శనివారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాజకీయ శక్తిగా ఎదగాలని అన్నారు.
ఇన్ని రోజులు కాషాయ జెండా పట్టిన ప్రతి కార్యకర్త ఇప్పుడు కరపత్రాలు పట్టి గడప గడపకు తిరిగి ప్రధాని మోదీ చేస్తున్న (Prime Minister Modi) అభివృద్ధి పనులను వివరించాలన్నారు. ఈ సందర్బంగా లింగంపేట్ మండలం (Lingampet manda) పోల్కంపేట గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, అసెంబ్లీ కన్వీనర్ లింగారావ్, బీజేపీ సీనియర్ నాయకులు దేవేందర్, ఎల్లారెడ్డి మండలాధ్యక్షుడు నర్సింలు, లింగంపేట్ మండలాధ్యక్షుడు క్రాంతి, నాగిరెడ్డి పేట్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, నాగిరెడ్డి పేట్ మాజీ మండలాధ్యక్షుడు హన్మాండ్లు, నాయకులు పాల్గొన్నారు.